దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వందల నుంచి ఏకంగా వేలకి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 3,095 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 15,208 కి పెరిగింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో 5 గురు ప్రాణాలు కోల్పోగా… దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,30,867 కి పెరిగింది. కరోనాతోనే కేరళలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… గోవా, గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, వారం పాజిటివిటీ రేటు 1.91 శాతంగా వుంది.
యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.78 శాతంగా ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 295 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టు తర్వాత కరోనా వైరస్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారు.కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో 765 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.