“కాపీ రైట్స్, మార్కెటింగ్, ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్” అంశాలపై దర్శకుల సంఘం సహకారంతో అవగాహనా సదస్సు!!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రముఖ దర్శకులు “వీర శంకర్”ను “ప్రొడ్యూసర్ బజార్” అబినందించింది. “ప్రొడ్యూసర్ బజార్” సహ వ్యవస్థాపకులు – సి.బి.ఓ (ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్) డి.విజయ్… దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు వీర శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు!!
నిర్మాతల మండలి సహకారంతో… నిర్మాతల ప్రయోజనాల పరిధిని విస్తృతపరచడమే లక్ష్యంగా “ప్రొడ్యూసర్ బజార్” నిర్వహించిన అవగాహనా సదస్సును ప్రశంసించిన వీర శంకర్… దర్శకుల సంఘం ఆధ్వర్యంలోనూ ఆ తరహా సదస్సును నిర్వహించాలన్న ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. “ప్రొడ్యూసర్ బజార్” కో-ఫౌండర్ & సి.బి.ఓ డి.విజయ్ ఈ సందర్భంగా వీర శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతల ప్రయోజనాల పరిరక్షణకు తమ సంస్థ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుందని పేర్కొన్న విజయ్… నిర్మాతలకు, దర్శకులకు “ప్రొడ్యూసర్ బజార్” ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు!!