దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. జీఎస్టీ సరిగ్గా చెల్లించలేదన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సుకుమార్ ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక.. సుకుమార్ నివాసంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇక… మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు గతంలోనూ జరిగాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు విడుదలకు ముందు కూడా ఈ సోదాలు జరిగాయి. ఇక.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Related Posts

Latest News Updates