కేదార్ నాథ్ దేవాలయం భక్తుల సందర్శనార్థం తెరుచుకుంది. మంగళవారం ఉదయం 6:20 గంటలకు కేదార్ నాథ్ ద్వారాలు భక్తుల కోసం తెరిచామన్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రకటించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకోవడంతో హర్ హర్ మహాదేవ్ కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. మరోవైపు ఆలయ ప్రధాన అర్చకులు జగద్గురు రావల్ భీమ్ శంకర్‌లింగ్ శివాచార్య ఆలయం తలుపులు తెరిచారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం తలుపులు తెరిచిన అనంతరం కేదార్ ధామ్‌ను దర్శించుకున్నారు. కేదార్ నాథ్ ఆలయాన్ని 35 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. రాష్ట్రంలో చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, భగవంతుని దయ వల్ల గతేడాది కంటే ఈ ఏడాది యాత్రకు భక్తులు అధికంగా వస్తారని సీఎం సింగ్ తెలిపారు.యాత్రికుల రక్షణ కోసం పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. మంచుతుపాన్ కూడా తగ్గడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.