తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తాయత్తు మహిమతోనే తాను ఇంత స్థాయిలో వున్నానని, డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందంటూ చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ‘నేను పుట్టిన టైమ్‌‌లో అనారోగ్యానికి గురయ్యాను. చావు బతుకుల మధ్య ఉన్నాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు నాకు తాయత్తు కట్టించారు.ఆ తాయత్తు మహిమతోనే నేను ఇప్పుడు ఈ స్థా యిలో ఉన్నా” అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారని తెలిపారు. రంజాన్ నెలలో మసీదులకు డబ్బులు ఇస్తున్నారని, అయితే అవి సరిపోవడం లేదని, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.