తమిళ రాజకీయంలోకి పెరుగు… తీవ్రంగా మండిపడుతున్న సీఎం స్టాలిన్

తమిళ రాజకీయాల్లో పెరుగు వచ్చి చేరింది. ఇప్పుడు పెరుగు అంశం తెగ వివాదమై కూర్చుంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) పెరుగుపై తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ పై కొన్ని ఆదేశాలిచ్చింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ లో వున్న CURD, తమిళంలో వున్న తయిర్ తీసేసి, హిందీలో దహీ అని పెట్టాలని ఉత్తర్వులిచ్చింది. కేవలం పెరుగు మాత్రమే కాకుండా… పాల ఉత్పత్తులన్నింటిపైనా… హిందీలో పేర్లు వుండాలని సూచించింది.

 

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా.. పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పెరుగు ప్యాకెట్ పైనా మా సొంత భాషలో వున్న పేరును తీసేసి, హిందీలో రాయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆదేశాలు అమలయితే భాషా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదంతా కేంద్రం చేస్తోన్న కుట్రగా అభివర్ణించిన ఆయన.. హిందీని ఇలా రుద్దాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు.

Related Posts

Latest News Updates