బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు. ఈ నెల 16 న ఆమె ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం విచారణలో భాగంగా కొన్ని రోజుల క్రితమే కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు9 గంటల పాటు కవితను ఈడీ ప్రశ్నించింది. మళ్లీ 16 న హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లారు. అయితే… బుధవారం భారత్ జాగృతి ఆధ్వర్యంలోట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కి వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఢిల్లీలోని లే మెరేడియన్హోటల్లో మధ్యాహ్నం నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.







