డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు. గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న కేసులో కీలక నిందితుడిగా ఎడ్విన్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు ఎడ్విన్ ను అరెస్ట్ చేసి… కొన్ని రోజులైనా గడవక ముందే… బెయిల్ పై విడుదల కావడం గమనార్హం. దాదాపు పోలీసులు 3 నెలల పాటు శ్రమించి, గోవా నుంచి ఎడ్విన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇ తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. అంతేకాకుండా అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు ఆస్తుల్ని జప్తు చేయించే ప్రక్రియలో పోలీసులు నిమగ్నమై వున్న సమయంలో ఆయనకు బెయిల్ వచ్చింది.

 

 

గోవా కేంద్రంగా మాదక ద్రవ్యాల నెట్ వర్క్ పనిచేస్తుంది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సారథ్యంలో కొందరు ఏర్పాటయ్యారు. ప్రధాన నిందితుడు ఎడ్విన్ కోసం న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి, ఈ నెల 5 న గోవా నుంచి పట్టుకొచ్చారు. ఇంత చేశారు. కేవలం 10 రోజుల్లోనే ఎడ్విన్ కు బెయిల్ రావడం గమనార్హం.