డిసెంబర్ కంటే ముందే వందే మెట్రో… ప్రకటించిన కేంద్రం

వందే మెట్రో విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ యేడాది డిసెంబర్ కంటే ముందే వందే మెట్రో నెట్ వర్క్ ను అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రటకించారు. వందే భారత్ తో పోలిస్తే వందే మెట్రో విభిన్నంగా వుంటుందని, చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో నాలుగైదు సర్వీసులు నడిపేలా దీన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు. పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్ల లోపు వున్న ప్రాంతాలకు ఇవి రాకపోకలు సాగిస్తాయని ప్రకటించారు. సౌకర్యవంతంగా వుండటంతో పాటు అందరికీ అందుబాటులో ధరలు వుంటాయని కూడా పేర్కొన్నారు. పెద్ద నగరాల చుట్టుపక్కల వున్న వారు పనికోసం నగరానికి వచ్చి, మళ్లీ తమ స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా చూడడానికే వందే మెట్రోని తీసుకొస్తున్నట్లు కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు వెసులుబాటుగా వుంటుందని కూడా తెలిపారు.

Related Posts

Latest News Updates