డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ చేసి దాంతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. టిల్లు స్వ్కేర్ కు విశేష ఆదరణ దక్కడంతో టిల్లూ క్యూబ్ ను కూడా తీస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సిద్దు దాని కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడని ఆయన సన్నిహితులంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే డీజే టిల్లులో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి రాధిక పాత్రలో ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా రాధిక పేరు మారు మోగుతూనే ఉంది టిల్లు స్వ్కేర్ లో హీరోయిన్ గా అనుపమ లిల్లీ క్యారెక్టర్ చేసినప్పటికీ ఆమెను రాధిక 2.0 అనే అనుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ లో రాధిక 3.0గా ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. హీరోయిన్ సెలెక్షన్ విషయంలో సిద్దు ఛాయిస్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రియాంక ఎంపిక కూడా సినిమాకు మంచి ఎట్రాక్షన్ కానుండటం ఖాయమని టిల్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.