జాతీయ పంచాయతీ రాజ్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం పలు పురస్కారాలను దక్కించుకుంది. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 9 విభాగాల్లో కలిపి 27 అవార్డులను కేంద్రం ప్రకటించగా… తెలంగాణలోని పలు పంచాయతీలు 8 అవార్డులను దక్కించుకున్నాయి. 4 కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలు మొదటి, రెండో స్థానంలో నిలిచాయి. వాటర్ సఫిషియంట్ పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్లకు అగ్రస్థానం, సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా కొంగట్ పల్లికి మొదటి స్థానం, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో సూర్యాపేట జిల్లా ఐపూర్ కు అగ్రస్థానం రాగా… పావర్టీ ఫ్రీ విభాగం గద్వాల జిల్లా మాన్ దొడ్డికి రెండో స్థానం దక్కింది.

27 జాతీయ పంచాయ‌తీ అవార్డులో రాష్ట్రానికి 8 వ‌చ్చాయి. నాలుగు కేట‌గిరిల్లో తెలంగాణ అగ్ర‌స్థానంలో ఉంది. గ్రామీణాభివృద్ధి సీఎం కేసీఆర్ దార్శ‌నిక‌త‌కు అవార్డులే నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి, అధికారుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.