జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనుంది. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై ఆయనను సీబీఐ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కు సంబంధించిన స్కామ్ ఇది. దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని అప్పుడు గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఒక్క నెలలోనే ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.