జమ్మూ కశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన కేంద్రం

భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపింది. జమ్మూ కశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పై నిషేధం విధించింది. ఈ రెండింటినీ ఉగ్రవాద సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండూ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటయ్యాయి. అలాగే పంజాబ్ కి చెందిన హర్విందర్ సింగ్ సంథు అలియాస్ రిండాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

JKGF లాంటి సంస్థ దేశంలోకి చొరబాట్లు, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రదాడులు, బెదిరింపులకు దిగుతోందని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే లష్కరే తోయిబా, జైషేమహ్మద్, హర్కత్ ఉల్ జెహాదీ ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఉగ్రవాదులను కూడా రిక్రూట్ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. జమ్మూ కశ్మీర్ ప్రజలను భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు JKGF సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారని తెలిపింది.

 

ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 10 ప్రదేశాల్లో అధికారిక రహస్యాల చట్టం-1923ను ప్రయోగిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో అండమాన్‌-నికోబార్‌ దీవులతోపాటు తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కేరళ రాష్ట్రాలున్నాయి. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ, అండమాన్‌-నికోబార్‌లలో ఒక్కో ప్రదేశం, మిగతా రాష్ట్రాల్లోని రెండేసి ప్రదేశాలు నిషేధిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. ఈ ప్రదేశాలపై అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్‌ 2లో ఉన్న 10 క్లాజులను అమలు చేయనున్నట్లు హోంశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Related Posts

Latest News Updates