చౌటుప్పల్ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్‌ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు.చౌటుప్పల్‌లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడం ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయాయని తెలిపారు.

ఈ దవాఖానలో ప్రతి నిత్యం సుమారు 300 మందికిపైగా ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ సూచనలతో 100 పడకల ఆ్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. మర్రిగూడలో 30 పడగకల ఆస్పత్రి మంజూరు చేశామని, తంగేడిపల్లి పీహెచ్ సీకి 90 లక్షలు కేటాయించామని వివరించారు. చౌటుప్పల్‌తో పాటు సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, చిట్యాల, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నా యి.