వైజయంతీ అశ్వనీదత్ సంస్థలో తీసిన బ్లాక్ బస్టర్ హిట్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సంస్థలో చిరంజీవి చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మూవీకి సెకండ్ పార్ట్ తీస్తామని, సీక్వెల్ ఆలోచనలున్నాయని అశ్వనీదత్ ఎన్నో మార్లు చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో తీస్తారంటూ ఆ మధ్య ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. కానీ అవేవీ కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా వైజయంతీ మూవీస్ నుంచి మాత్రం ఓ వార్నింగ్ నోటీస్ వచ్చింది.జగదేక వీరుడు అతిలోక సుందరి కాపీ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి.. ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా ఎవరు వాడుకున్నా లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. ఆ సినిమాలోని విజువల్స్, కారెక్టర్స్, సినిమాకు సంబంధించిన కథ, సీక్వెల్స్, ప్రీక్వెల్ అంటూ ఇలా ఎవరు వాడుకున్నా కూడా చర్యలు తీసుకుంటాం.. అన్ని హక్కులు మాకే చెందుతాయి అంటూ ఇలా సుధీర్ఘంగా ఆ నోటీసులో ఉంది. అయితే ఈ వార్నింగ్ ఇచ్చింది మాత్రం చిరంజీవి వశిష్ట ప్రాజెక్ట్ గురించే అని చర్చలు నడుస్తున్నాయి.