జీవుడు తాను పుట్టిన దగ్గర్నుండి మరణించే వరకు తన యొక్క పూర్వజన్మ లోని చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపములో ఎన్నో ఎన్నెన్నో అనుభంధాలను, ఆనందాలను, ఐశ్వర్యాలను, ప్రేమానుబంధాలను, భాద్యతలను, సుఖాలను అనుభవించడం జరుగుతుంది. పూర్వజన్మలో ఎవరితోనైతే శత్రుత్వము కలిగి ఉంటారో, ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపములో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పూర్వజన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య, ఆర్థిక,సామాజిక, కుటుంబ, బంధుత్వాల ఋణ శేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాడు. ఆ పూర్వజన్మ తాలూకు ఋణశేషం, శత్రు శేషం, ఆయుర్భావ శేషం, ఇహ జన్మలో గ్రహాల ద్వారా యోగా, అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేయటం జరుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతం. అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న, ఎదుర్కొబోయే సమస్యలు, దోషాలు వేద జ్యోతిష్య శాస్త్రము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినపుడు ఈ కర్మఫలములో ఉండే అతి భయంకరమైన మానసిక, శారీరక క్షోభకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవటం ఎంతవరకు సాధ్యం? అని ప్రతి ఒక్కరకి సందేహం కలుగక మానదు. విధి అనేది తప్పక అనుభవించాల్సిందని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు, యక్షులు, శాపాలకు గురి కావడం జరిగింది. శాపాలకు గురి కావడం అనేది విధి. శాపాలకు విమోచన, విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి. పూర్వజన్మ కర్మఫలం శరీర రూపములో ఆత్మ అనుభవించడం జరుగుతుంది. శరీరము రూపములో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూలశరీరమునకు మాత్రమే ఆ నొప్పి, ఆనందం తెలుస్తాయి. అంతేగానీ శాశ్వతమైన ఆత్మకు కాదు. ఆత్మ అనేది శరీరములో ఉండే సూక్ష్మ రూపములో ఉండే ఆలోచనల రూపం. కర్మ ఫలం వలన గాని, మానసిక దౌర్బల్యం వలన గాని, సమస్యలను ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలియజేస్తాడు. ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గములే ఈ తంత్ర విద్యలు. కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవటానికి ఆ పరమాత్మే మార్గాలను చూపించాడు. మానవ రూపములో ఉన్న పాండవులను, వారి కర్మ ఫలమును అనుభవించేట్టుగా చేస్తూ మరొకపక్క అతి ఘోర కృత్యాలకు పాల్పడే వారి నుండి బయట పడేందుకు శత్రు నాశనం చేసేందుకు శ్రీ కృష్ణ పరమాత్మ సైతం తంత్ర విద్యాలలోని శస్త్ర. అస్త్రములను ఆ మానవ రూపములో ఉన్న పాండవుల చేతనే ప్రయోగింపజేసి శత్రు సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. మహాభారతములో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా!!! గ్రహాల రూపములో, గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం, దీనినే వశీకరణాస్త్రం అంటారు. ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు, రాహు గ్రహముల సహాయముతో ప్రయోగిస్తారు. గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించేవాటిని ఆస్త్రాలు అంటారు. తంత్రవిద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్రం అంటారు.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు