క్రికెట్ అభిమానులకు జబర్దస్త్ న్యూస్… ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

క్రికెట్ అభిమానులకు జబ్దరస్త్ న్యూస్. ఐపీఎల్ 16 వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎస్ 16 వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 31 న ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఆరంభ వేడుకలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్ లో సీఎస్ కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. మార్చి 31 నుంచి మే 28 వరకూ ఐపీఎల్ జరగనుంది.

 

ఇక మే 21 వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 70 మ్యాచ్ లలో 18 డబుల్ హెడార్స్ వున్నాయి. ప్లే ఆఫ్స్ కి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించాల్సి వుంది. గ్రూప్ A లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వున్నాయి. గ్రూప్ B లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ కింగ్స్, వున్నాయి. అహ్మాదాబాద్, మొహాలి, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనున్నాయి.

Related Posts

Latest News Updates