మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ బాంబ్ పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై కీలక ఆరోపణలు చేశాడు. ఈ కేసులో రూ. 100 కోట్ల ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుఖేశ్ చంద్రశేఖర్ రూ. 75 కోట్లకు సంబంధించిన గుట్టు విప్పాడు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్ కు రూ. 75 కోట్లు ఇచ్చానన్నారు. రూ. 15 కోట్లు చొప్పున ఐదు సార్లు బీఆర్ఎస్ నేతలకు రూ. 75 కోట్లు ఇచ్చినట్లను ఓ లేఖలో వెల్లడించాడు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసు దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తన లేఖలో పేర్కొన్నాడు.
ఆ ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. అయితే, ఏపీ అంటే ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైయా.. లేక మరో వ్యక్తా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.
పైగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికే ఈ మొత్తాన్ని అందజేశానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేక కలకలం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్తే 2020లో హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు తాను వచ్చినట్లు సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించాడు. కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలతో కూడిన లేఖను తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా సుఖేశ్ బయట పెట్టాడు.