కెరీర్లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్‌తో బాల‌య్య మూవీ

ఏపీ ఎల‌క్ష‌న్స్ కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా రాజ‌కీయాలతో బిజీ అయిన బాల‌కృష్ణ ఇప్పుడు ఎల‌క్ష‌న్స్ పూర్త‌వ‌డంతో ఫ్రీ అయ్యాడు. ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత మూడు రోజులు రెస్ట్ తీసుకుని ఇప్పుడు తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టాడు. బాబీ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ లో బాల‌య్య ప్ర‌స్తుతం సంద‌డి చేస్తున్నాడు. వాస్త‌వానికి బాబీ ఇప్ప‌టికే ఈ సినిమాను పూర్తి చేయాల్సింది.

కానీ బాల‌య్య డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో సినిమా లేట‌వుతూ వ‌చ్చింది. జూన్ లేదా జులై వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యే ఛాన్సుంది. ఆ త‌ర్వాత వెంట‌నే బాల‌య్య, బోయ‌పాటితో సినిమాను మొద‌లుపెట్టనున్నాడు. ఇప్ప‌టికే బోయ‌పాటి ఆ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ తో బిజీగా ఉన్నాడు. సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న త‌ర్వాత వీరి కాంబోలో ఈ సినిమా రాబోతుంది.

ఈ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాల‌ని బాల‌య్య‌, బోయ‌పాటి భావిస్తున్నారు. 14 రీల్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నున్న ఈ సినిమా నిర్మాణంలో ఏపీకి చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయకుడు కొత్త‌గా ఎంట‌రైన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాల‌య్య కెరీర్లో ఇప్ప‌టి వ‌ర‌కు పెట్ట‌ని బ‌డ్జెట్ ను ఖ‌ర్చు పెట్ట‌నున్నార‌ట‌. సుమారు రూ.150 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. షూటింగ్ కు ముందే రూ.150 కోట్లు అంటున్నారంటే సినిమా పూర్త‌య్యే నాటికి అది రూ.200 కోట్లు అవ‌డం ఖాయమ‌నే టాక్ వినిపిస్తుంది. 

Related Posts

Latest News Updates