కాకినాడ తునిలో టీడీపీ నేత పొల్నాటి శేషగిరి రావుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. భవానీ మాల వేషంలో వచ్చిన వ్యక్తి… ఒక్క సారిగా ఆయనపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం బైక్ పై పరారయ్యాడు. దీంతో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయమైంది. దీంతో కుటుంబీకులు ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలోకి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఇక… ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత యనమల మాట్లాడుతూ… దీనికి సీఎం, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని ప్రోత్సహించిన వారిని వెంటనే పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దాడిశెట్టి మంత్రి అయిన తర్వాతే ఇలాంటి పెరుగుతున్నాయని ఆరోపించారు.