కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ వాయిదా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ… విపక్ష పార్టీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సహా విపక్ష నేతలందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లోనూ విప‌క్ష ఎంపీలు ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. లోక్‌స‌భ‌లో కొంద‌రు ఎంపీలు స్పీక‌ర్ ఓం బిర్లా చైర్‌ను ముట్ట‌డించారు. స్పీక‌ర్ చైర్‌పై పేపర్లు చించి విసిరేశారు. ప్ల‌కార్డుల‌ను కూడా విసిరేశారు.

ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. అయితే ఆందోళ‌న‌ల మ‌ధ్య‌లోనే స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. రాజ్య‌స‌భను 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో విపక్ష ఎంపీలు భేటీ అయ్యారు. రాహుల్ అనర్హత పై ప్రతిపక్షాల వ్యూహం గురించి చర్చించారు. ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశానికి డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆప్, శివసేన తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. టీఎంసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా హాజరైంది.

Related Posts

Latest News Updates