ఐపీఎల్ 2023 : ముంబై పై బెంగళూరు ఘన విజయం

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై బెంగళూరు విజయం సాధించింది. ముంబై 172 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా… 3.4 ఓవర్లు మిగిలి వుండగానే.. 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. బెంగళూరు ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ముంబై బౌలర్లకు చుక్కులు చూపెట్టారు. ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా వచ్చిన బాల్ ను వచ్చినట్టుగా బౌండరీ తరలించారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే… అయితే.. 148 పరుగుల వద్ద డుప్లెసిస్ వికెట్ తీసి, విరాట్, డుప్లెసిస్ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన దినేశ్ కార్తిక్ డకౌట్ అయ్యాడు. దీంతో గ్లెన్ మ్యాక్స్ వెల్ల రంగంలోకి దిగాడు. రెండు సిక్సులు కొట్టి, మ్యాచ్ ని ముగించాడు.

Related Posts

Latest News Updates