ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 65 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 58 శాతం అని తెలిపారు. ఇక.. రెండో సంవత్సరంలో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఈ నెల 27 నుంచి మే 6 వరకూ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 8,13,033 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో 2,66,326 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ లో 2,72,001 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి ప్రకటించారు. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 61 శాతం కాగా, రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 72 అని మంత్రి పేర్కొన్నారు.