ఎల్ఐసీ చైర్మన్ గా సిద్ధార్థ మహంతి.. కేంద్రం ఉత్తర్వులు

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్ గా సిద్ధార్థ మహంతిని కేంద్రం నియమించింది. ఎల్ఐసీ చైర్మన్ గా వ్యవహరించిన ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ యేడాది మార్చితో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మహంతిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మహంతి ఎల్ఐసీ ఎండీగా, యాక్టింగ్ చైర్మన్ బాధ్యతల్లో వున్నారు. 2025 జూన్ 7 తేదీ వరకూ మహంతి ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్ల నియామ‌క సంస్థ.. ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో (FSIB) గ‌త నెల‌లో సిద్ధార్థ మ‌హంతి పేరును ఎల్ఐసీ చైర్మన్‌గా సిఫార‌సు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార‌సుల‌ను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ నియామ‌కాల క‌మిటీ ఆమోదం తెలుపగా.. నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts

Latest News Updates