హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మద్దతిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా తమకే సీటు కేటాయించి, మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు పలకాలని నిర్ణయించారు. గతంలో కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని MIM కే సీఎం కేసీఆర్ కేటాయించారు. ఈసారి కూడా MIM కే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్యా 9 సంవత్సరాలుగా ఒప్పందం నడుస్తూ వస్తోంది. GHMC ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ MIM కే మద్దతిచ్చింది.