ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరందరూ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక… కొత్తగా ఎప్పటి నుంచో ప్రచారంలో వున్న దేశపతి శ్రీనివాస్ కి మొదటిసారిగా అవకాశం కల్పించారు.