ఈ నెల 15 న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన : బొత్స ప్రకటన

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15 న విశాఖలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయని ప్రకటించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 3 రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని అన్నారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకే ఈ గర్జనకు తాము మద్దతు పలుకుతున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు.

 

 

విశాఖను పాలన రాజధానిగా చేస్తే వచ్చే నష్టమేంటో వివరించాలని మరోసారి డిమాండ్ చేశారు. ముసుగులో గుద్దులాట అవసరమే లేదని, అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ వుందని మరోసారి ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడికి బుర్ర వుందా? అంటూ ఫైర్ అయ్యారు. వుంటే.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా వైఎస్సార్ హయాంలోనే జరిగిందని, టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని బొత్స సవాల్ విసిరారు. విశాఖలో హెల్త్ సిటీ, ఐటీ పార్కు, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్టీఎస్, విమస్్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి, ముందుచూపుతో ఉద్యోగ అవకాశాలు కల్పించామని బొత్స వివరించారు.

Related Posts

Latest News Updates