ఇదో ప్రజాస్వామ్య హత్య…. ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఫైర్

కేంద్ర ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం ఏకనాథ్ షిండేదే అసలైన శివసేన అని, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం కూడా షిండే వర్గానికే చెందుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో ప్రజాస్వామ్య హత్య అని ఆక్రోశించారు. అసలు విల్లు బాణం గుర్తు తమ వద్ద వుందని, షిండే వర్గం కేవలం వాటిని కాగితాల్లో మాత్రమే కలిగి వుందన్నారు.

 

ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఈసీ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఈసీ ఉత్తర్వులను పక్కన పెడుతుందని తాము ఖచ్చితంగా అనుకుంటున్నామని ఉద్ధవ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేసి సీఎం కాగలరని థాకరే అన్నారు. షిండే వర్గానికి చెందిన వారు ముందుగా బాలాసాహెబ్‌ను అర్థం చేసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో మోడీ పేరు పనిచేయదు కాబట్టే వారు తమ స్వలాభం కోసం బాలాసాహెబ్ ముసుగుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని ఉద్ధవ్ విమర్శించారు.

 

Related Posts

Latest News Updates