ఫలితంతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్టులతో ఆడియన్స్ ను అలరించాలని చూస్తాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. మంచి కంటెంట్ తో వస్తే సూర్య సినిమాకు తెలుగులో కూడా భారీ డిమాండే ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పుడు మరోసారి కంగువ బిజినెస్ డీల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం సూర్య రెండేళ్ల పాటూ ఎంతో కష్టపడ్డాడు.ఇదిలా ఉంటే సూర్య, డైరెక్టర్ బాలాతో ఓ సినిమాను అనుకుని కొంత భాగం షూటింగ్ కూడా చేశాక కొన్ని విభేదాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు. అందులో హీరోయిన్ గా కృతి శెట్టిని కూడా తీసుకున్నారు. వనంగాన్ అనే టైటిల్ ను కూడా ఆ సినిమాకు ఫిక్స్ చేశారు. సూర్య తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ మరొకరి దగ్గరికి వెళ్లింది.
సాహోలో విలన్ గా పరిచయమైన అరుణ్ విజయ్ తో బాలా వనంగాన్ చేశాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే బాలా మేకింగ్ స్టయిల్ ప్రతీ ఫ్రేమ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అరుణ్ విజయ్ తో ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తో సీరియస్ కథను తెర మీద చూపించబోతున్నట్లు ట్రైలర్ తో అర్థవుతుంది. ఇదే సినిమాను సూర్య చేసి ఉంటే నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని ట్రైలర్ చూశాక నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అందుకే అంటారు ఎవరేది చేయాలన్నా రాసిపెట్టి ఉండాలని.