కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. మోకాలికి చికిత్స కోసం యశోదాకి వెళ్లారు. ఈ సమయంలోనే యశోద వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జానారెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయిందని వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.







