ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్… రాజస్తాన్ పై పంజాబ్ విజయం

ఐపీల్ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ 5 పరుగుల తేడాతో రాజస్తాన్ పై నెగ్గింది. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌–16లో వరుసగా రెండో విజయం సాధించినట్లైంది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 20 ఓవర్లలో 197/4 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 192/7 స్కోరు మాత్రమే చేసింది. సంజూ శాంసన్‌‌‌‌ (42), హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (36), ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (32 నాటౌట్‌‌‌‌) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఎల్లిస్​​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. బ్యాటింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ (56 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్‌‌‌‌), ప్రభుసిమ్రాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) కొడితే, బౌలింగ్‌‌‌‌లో నాథన్‌‌‌‌ ఎల్లిస్‌‌‌‌ (4/30) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

స్టార్టింగ్‌‌‌‌ నుంచే ధవన్‌‌‌‌, ప్రభుసిమ్రాన్‌‌‌‌ పోటీపడి బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 4, 6తో ప్రభుసిమ్రాన్‌‌‌‌ టచ్‌‌‌‌లోకి రాగా, థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో ధవన్‌‌‌‌ రెండు ఫోర్లతో లైన్‌‌‌‌లో పడ్డాడు. 4వ ఓవర్‌‌‌‌లో 4, 4, 6, 4తో 19 రన్స్‌‌‌‌ రాబట్టిన ప్రభు తర్వాత మరో 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో పంజాబ్‌‌‌‌ 63/0 స్కోరు చేసింది. 9వ ఓవర్‌‌‌‌లో రెండో సిక్స్‌‌‌‌ బాదిన ప్రభు తర్వాతి ఓవర్‌‌‌‌లో హోల్డర్‌‌‌‌ (2/29)కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌‌‌కు 90 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బాల్స్‌‌‌‌ తర్వాత భానుకా రాజపక్స (1) రిటైర్డ్‌‌‌‌హర్ట్‌‌‌‌ అయ్యాడు. ఈ దశలో వచ్చిన జితేశ్‌‌‌‌ (27), ధవన్‌‌‌‌కు మంచి సహకారం అందించాడు. 12వ ఓవర్‌‌‌‌లో ఈ ఇద్దరు 18 రన్స్‌‌‌‌ రాబట్టారు. తర్వాత మరో రెండు ఫోర్లు బాదిన ధవన్‌‌‌‌ 36 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు.

Related Posts

Latest News Updates