అమితాబ్ బచ్చన్ మనువరాలు ఆరాధ్య బచ్చన్ పై ఇటీవల యూట్యూబ్‌లో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇవాళ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్తలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్‌ను హెచ్చరించింది.
యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవల ఫేక్ న్యూస్ రిపోర్ట చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిలదీసింది. ఐశ్వర్య వేసిన పిటిషన్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు సమన్లు జారీ చేశారు. ఐటీ రూల్స్ ప్రకారం తమ పాలసీలను మార్చుకున్నారా లేదా అని ప్రశ్నించింది. ప్రతి చిన్నారికి గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉందని, ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.