అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశాడు. పవర్ ఫుల్ లుక్ తో రామ్ చరణ్ స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో RRR సినిమా గురించి, రాజమౌళి గురించి, నాటు సాంగ్ నామినేట్ విషయాలను మాట్లాడాడు. 1975 నుంచి ఈ షో అమెరికాలో సక్సెస్ గా నడుస్తోంది. ఈ షోకి మంచి డిమాండ్ వుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి గొప్ప రచయిత అని చెప్పాడు. తనను ఇండియన్ స్పిల్ బర్గ్ అని పిలుస్తామని తెలిపాడు. తన తర్వాత సినిమాతో రాజమౌళి గ్లోబల్ సినిమాపై తన మార్క్ చూపిస్తారని పేర్కొన్నాడు.

అయితే… పుత్రోత్సాహాన్ని మెగాస్టార్ ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ సినిమాకే రామ్ చరణ్ గర్వకారణమని చిరంజీవి ట్వీట్ చేశారు. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనడం తెలుగు/ భారతీయ సినిమాకే గర్వకారణమైన క్షణాలన్నారు. దార్శనికుడు రాజమౌళి మెదడులోంచి పుట్టిన ఓ ఉద్వేగభరితమైన ఆలోచనా శక్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూస్తే తెగ ఆశ్చర్యమేస్తోంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1628622686258868229?s=20













