పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలను ముగించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బయల్దేరారు. హరిత ప్లాజా వైపు షా కాన్వాయ్ బయల్దేరింది. అయితే…. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్ ఆగిన సమయంలో ఆయన కాన్వాయ్ కి అడ్డంగా ఓ కారు వచ్చింది. దీంతో కాన్వాయ్ 5 నిమిషాలు అలాగే వుండిపోయింది. ఎంత సేపటికీ ఆ కారు యజమాని కారు పక్కకు తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు అద్దాలను పగలగొట్టారు. అయితే… ఈ వ్యక్తి మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. అయితే… తాను టీఆర్ఎస్ కార్యకర్తనే గానీ.. ఉద్దేశపూర్వకంగా రోడ్డుపై ఆపలేదని వివరణ ఇచ్చారు.