అమర్ నాథ్ యాత్రీకుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

అమర్ నాథ్ యాత్రీకుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అనంతనాగ్ జిల్లా పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ అమర్ నాథ్ యాత్ర ఈ యేడాది జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 31 న ముగుస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి చెందిన 316 బ్రాంచ్ లు, జమ్మూ కశ్మీర్ లో 90 బ్రాంచ్ లు, యస్ బ్యాంక్ లో 37 బ్రాంచీలు, ఎస్ బీఐ 99 బ్రాంచీలతో పాటు దేశ వ్యాప్తంగా 542 బ్యాంక్ బ్రాంచీలలో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అయితే… ఈ సారి ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్ అనే కొత్త ప్రక్రియను ప్రారంభించారు. దీని కోసం థంబ్ స్కాన్ చేయాల్సి వుంటుంది. 13 నుంచి 70 ఏళ్ల భక్తులే అమర్ నాథ్ యాత్రకు అర్హులని, అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Related Posts

Latest News Updates