భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో పోడు భూముల విషయంలో గుత్తికోయలకు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో అటవీ అధికారి శ్రీనివాస్ పై వేటకొడవళ్లతో గుత్తికోయలు దాడి చేశారు. మెడ భాగంలో కత్తితో దాడి చేయడంతో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అధికారి శ్రీనివాస రావు మృతి చెందారు.

చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీ అధికారులు నాటిన మొక్కలను పోడుభూముల సాగుదారులు తీసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిని అటవీ అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా దాడులకు దిగారు.