డాక్టర్ అంబల్ల జనార్దన్ రాసిన తెలుగు కథలు గుజరాతీలోకి అనువాదమైన పుస్తకావిష్కరణ త్యాగరాజ గానసభలో జరిగింది. శ్రీమానస సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుజరాత్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ అధ్యక్షుడు జిగ్నేశ్ దోశి హాజరై, ముంబయిని ఛత్ర ఛాయమా అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు. నగరంలో వున్నగుజరాతి ప్రజల సంక్షేమం కోసం 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని తెలిపారు. మాతృభాషను ప్రేమించాలని, పర భాషను ఆదరించాలన్నారు. గుజరాతీలు హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డారని, తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నారని, తెలుగు వారితో కలిసిపోతున్నారని తెలిపారు. జనార్దన్ రాసిన కథల్లో గుజరాతీయులు జీవన విధానం వుందన్నారు. తెలుగు నుంచి గుజరాతీలోకి జనార్దన్ కథలను తీసుకురావడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వాణిరెడ్డి, నర్మద, కనకదుర్గ, గుజరాతీ రచయిత హెచ్ సీ ఉపాధ్యాయ, మానస సంస్థ అధినేత రఘు పాల్గొన్నారు.