తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు ఎట్టకేలకు హనుమకొండ కోర్టులో హజరుపరిచారు. కోర్టు ముందు భారీగా కార్యకర్తలు వుండటంతో వెనుక ద్వారం గుండా బండి సంజయ్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో బండి సంజయ్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. తదనంతరం కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ పేపర్ లీక్ లో  బీజేపీ స్టేట్ చీఫ్  బండి సంజయ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో  ఎ1 గా బండి సంజయ్ ని చేర్చారు.  ఎ2 గా ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు.

 

తర్వాత బొమ్మల రామారం పీఎస్ కి తరలించారు. అక్కడి నుంచి పోలసు వాహనాలకు పేపర్లు అతికించి, బండి సంజయ్ కనిపించకుండా… వరంగల్ వైపు తీసుకెళ్లారు. అయితే… ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారన్నది మాత్రం పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. మధ్యలో పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి వర్ధన్నపేట మీదుగా… చివరికి హనుమకొండ కోర్టుకి తీసుకొచ్చారు.