సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఏపీలో భారీ జరిమానాలు

సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఏపీ సర్కార్ భారీ జరిమానా విదించనుంది. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటి తప్పుగా 50 వేలు, రెండో మారు లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో 25 నుంచి 50 వేల జరిమానా వేయనున్నారు. సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాలయ చొప్పున జరిమానా వుంటుంది. అంతేకాకుండా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే 20 వేల నుంచి 40 వేల జరిమానా వసూలు చేయనున్నారు. ఇప్పటికే తత్సంబంధిత కమిషనర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది.

Related Posts

Latest News Updates