మెగాస్టార్ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకి సంబంధించి రోజూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే వుంది. దీంత అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తాజాగా… వాల్తేరు వీరయ్య టీమ్ మరో అప్ డేట్ ఇచ్చింది. చిరంజీవి లేటెస్ట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘పోస్టర్ శాంపిల్ మాత్రమే…ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా’ అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. గాగుల్స్ ధరించి ఉన్న చిరు చుట్టూ.. తుపాకులు ఉన్నాయి. చేతికి బేడీలు ధరించి ఉన్నారు. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న చిరును చూసి అభిమానులు తెగ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక… రవితేజకు సంబంధించిన టీజర్ ను రెండు రోజుల క్రిందటే విడుదల చేశారు.
https://twitter.com/DirBobbyFC/status/1603604647163617281?s=20&t=9-Nk6L1G6ik0HaEVADTm4g












