రాజా సాబ్ విష‌యంలో ఆ వార్త‌లన్నీ పుకార్లే!

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ చేస్తున్న‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ సినిమాలే. ప్ర‌భాస్ చేతిలో 5 సినిమాలుంటే అందులో లో బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమా అంటే రాజా సాబ్. రూ.150 కోట్ల బ‌డ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ తాజాగా హైద‌రాబాద్ లో స్టార్ట్ అయింది.

ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్ తో పాటూ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కూడా పాల్గొంటుంది. వారిద్ద‌రికీ సంబంధించిన కీల‌క అంశాల‌ను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా నెట్టింట ఓ టాక్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని నెట్టింట వినిపిస్తోంది.

అయితే రాజా సాబ్ ఫ‌స్ట్ సింగిల్ కు సంబంధించి నెట్టింట వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని చిత్ర యూనిట్ చెప్తుంది. ప్ర‌స్తుతం మారుతి ఫోక‌స్ అంతా చిత్ర షూటింగ్ పైనే ఉంద‌ని, దానికి తోడు క‌ల్కి రిలీజ్ అయ్యేవ‌ర‌కు రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండ‌వ‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ను మొదలు పెట్టాల‌ని మారుతి చూస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం.  

Related Posts

Latest News Updates