బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు మూడు రోజుల పాటు 60 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. మంగళవారం మొదలైన ఈ సోదాలు గురువారం రాత్రితో ముగిశాయి. సంస్థ ఆర్థిక లావాదేవీలపై తమకు కావాల్సిన సమాచారాన్ని ఐటీ అధికారులు తీసుకున్నారు. సీనియర్ ఉద్యోగుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోదాల్లో భాగంగా పలువురు ఉద్యోగులను మూడు రోజులుగా అధికారులు ఇంటికి పంపలేదని సంబం ధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీ ఆఫీసులోనే ఉన్నారు.ఇన్ కం ట్యాక్స్ సర్వే ప్రారంభమైన నాటి నుంచి కంపెనీకి చెందిన 10 మంది సీనియర్ ఉద్యోగులు ఆఫీసులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఐటీ సర్వే ప్రభావం బీబీసీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని కంపెనీ ప్రకటించింది.












