ప్రతి యేడాది నిర్వహించే ప్రవేశ పరీక్షల వర్శిటీలను, ప్రవేశ పరీక్షల కన్వీనర్లను కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్శిటీలు, కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. టీఎస్ ఎంసెట్, టీఎస్ పీజీఈసెట్‌ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను జేఎన్టీయూహెచ్‌కు, టీఎస్ ఐసెట్‌ను కాక‌తీయ యూనివ‌ర్సిటీకి, టీఎస్ లాసెట్‌, పీజీఎల్‌సెట్, ఈసెట్ ఉస్మానియా యూనివ‌ర్సిటీ, టీఎస్ ఎడ్‌సెట్ మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ, టీఎస్ పీఈసెట్ శాత‌వాహ‌న‌ యూనివ‌ర్సిటీకి అప్ప‌గించారు.

టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ బీ డీన్ కుమార్ (జేఎన్టీయూహెచ్)
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మి (ఓయూ)
టీఎస్ పీజీ ఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ బీ ర‌వీంద్ర రెడ్డి (జేఎన్టీయూహెచ్)
టీఎస్ ఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ శ్రీరాం వెంక‌టేశ్ (ఓయూ)
టీఎస్ ఐసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ పీ వ‌ర‌ల‌క్ష్మి (కాక‌తీయ యూనివ‌ర్సిటీ)
టీఎస్ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ (ఓయూ)
టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ రాజేశ్ కుమార్(ఓయూ)