నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహానికి నిర్వాహకులు చివరి పూజలు చేసి, నిమజ్జనం కోసం తరలి వెళ్లారు. విగ్రహం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఊరేగింపుగా వెళ్లారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకుంటుంది. గణనాథుడ్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం మధ్యాహ్నం వరకూ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం చేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.