దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు : కేంద్ర కేబినెట్ నిర్ణయం

దేశంలో ప్రస్తుతం వున్న మెడికల్ కాలేజీలతో కలిపి 1,570 కోట్లతో మరో 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఆ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకి వెల్లడించారు. దేశంలో తక్కువ ధరకు నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించాలన్న లక్ష్యంతో పాటు నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయమని కేంద్ర మంత్రి వివరించారు. రానున్న రెండేళ్లలో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ప్రతి ఏడాది కొత్తగా 15,700 నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కలగనుంది. ఇక.. మెడికల్ పరికరాల రంగానికి సంబంధించి ఓ విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని మాండవీయ తెలిపారు. ప్రతి కాలేజీలో 100 నర్సింగ్ సీట్లు వుంటాయని, యూపీలో 27, రాజస్థాన్ లో 23, మధ్యప్రదేశ్ లో 14, తమిళనాడు, బెంగాల్ లో 11, కర్నాటకలో 4 కాలేజీలు నెలకొల్పుతామని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates