టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశారు. దేశానికే తెలంగాణ అన్నం పెడుతుందని.. కానీ తమ పార్టీ పుట్టిన తరువాతే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు చెప్పారని అంటున్నారని అన్నారు. ఆయనను ఇలాగే వదిలేస్తే.. చార్మినార్ కూడా తానే కట్టానని అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఏపీలో వరి సాగు 16 లక్షల ఎకరాల్లో జరిగితే.. తెలంగాణ లో 54 లక్షల ఎకరాల వరి నాట్లు వేశారని మంత్రి హరీశ్ రావు వివరించారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కారణజన్ముడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ  సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆయనపై విమర్శలు వచ్చేందుకు కారణమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే  తెలంగాణ ప్రజలు బియ్యం ఆహారంగా తీసుకోవడం ప్రారంభించారంటూ చంద్రబాబు అన్నారు. ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.