ఘనంగా రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా ట్రైలర్ రిలీజ్ 

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ చొల్లేటి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేయడం హ్యాపీగా ఉంది. సినిమా బాగా వచ్చింది. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ – మా “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి వచ్చిన హీరో విశ్వక్ సేన్ గారికి థ్యాంక్స్. ఆయన సినిమాలో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే సూపర్ హిట్ సాంగ్ రాశాను. ఆ పాటకు అవకాశం ఇచ్చిన  విశ్వక్ గారిని మర్చిపోలేను. “ఆపరేషన్ రావణ్” సినిమాలో ఓ మంచి లవ్ మెలొడీ సాంగ్ రాసే అవకాశం దక్కింది. చందమామ కథలో అనే పాటకు మంచి లిరిక్స్ కుదిరాయి. హీరో రక్షిత్ గారు ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశారు. ఆయనకు “ఆపరేషన్ రావణ్” మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ సంగీర్త విపిన్ మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకట సత్య గారికి థ్యాంక్స్. అలాగే రక్షిత్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించేందుకు మా మూవీ టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. “ఆపరేషన్ రావణ్”లో నేను టీవీ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రలో నటించేప్పుడు టెన్షన్ పడ్డాను. ఆగస్టు 2న మా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

కమెడియన్ రాకెట్ రాఘవ మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” మూవీలో మీకు మంచి వినోదాన్ని అందించబోతున్నా. ఈ సినిమాలో నాది జర్నలిస్ట్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ కోసం కొత్తగా మేకోవర్ చేయించారు డైరెక్టర్ గారు. ఆయన ఎంతో పర్టిక్యులర్ గా మూవీ రూపొందించారు. రాత్రి 2 వరకు తను అనుకున్న షాట్ అనుకున్నట్లు వచ్చేవరకు షూటింగ్ చేయించేవారు. వెంకట సత్య గారి ప్రొఫెషనలిజం చూస్తే ఫస్ట్ మూవీ డైరెక్టర్ అనిపించలేదు. “ఆపరేషన్ రావణ్” సైకో థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.

రైటర్ లక్ష్మీ లోహిత్ మాట్లాడుతూ – మతి ఎంతో గతి అంతే అనే సూక్తి ఉంది. మన ఆలోచనలు ఎలా ఉంటాయో జీవితం అలాగే ఉంటుంది. ఈ లైన్ తో మా డైరెక్టర్ వెంకట సత్య గారు “ఆపరేషన్ రావణ్” సినిమాను రూపొందించారు. ఆయన చాలా మంచి మనిషి. మా టీమ్ లో ఎవరినీ నొప్పించకుండా వర్క్ చేయించుకున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిసిస్ట్ ప్రణవం మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్”లో పాటలు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. పూర్ణాచారి ఒక పాట రాస్తే మిగతా సాంగ్స్ నేను రాశాను. నేను ఈ టీమ్ తో ట్రావెల్ అయ్యాను. డైరెక్టర్ గారు అహర్నిశలు ఈ మూవీ కోసం పనిచేశారు. తప్పకుండా “ఆపరేషన్ రావణ్” సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

ఎడిటర్ సత్య మాట్లాడుతూ – మీ ఆలోచనలే మీ శత్రువులు అనే ట్యాగ్ లైన్ తో “ఆపరేషన్ రావణ్” సినిమాను రూపొందించారు మా డైరెక్టర్ వెంకట సత్య గారు. ఆయన ఎక్కడా కొత్త డైరెక్టర్ లా మూవీ చేయలేదు. ఎక్సీపిరియన్స్డ్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమాకు ఘన విజయం దక్కుతుందని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ – మా “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ లాంఛ్ కు హీరో విశ్వక్ గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయడం లేదు. ఈ సినిమాకు నేనే ఎందుకు డైరెక్షన్ చేశాను అనేది చెబుతాను. నీకు ఈ సినిమాలు చేయడం అవసరమా అనేవారూ ఉంటారు. నేను ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలోనూ చూడని అంశాలు “ఆపరేషన్ రావణ్” చిత్రంలో చూపించబోతున్నా. అవి తెలంగాణ, ఆంధ్రాలో, అమెరికాలో మీరు ఎప్పుడూ చూడలేదు. రాజమౌళి గారు కూడా ఇలాంటి అంశాన్ని తెరపై చూపించలేదు. అదే మీ ఆలోచనలు. మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచి వాళ్లా చెడ్డ వాళ్లా అనేది నిర్ణయించడం జరుగుతుంది. మీ ఆలోచనలే మీరు ఎలా ఉండాలే డిసైడ్ చేస్తాయి. ఆ పాయింట్ తో “ఆపరేషన్ రావణ్” సినిమాను రూపొందించాను. ఫస్ట్ టైమ్ మీ ఆలోచనలను విజువల్ గా తెరపై చూపించబోతున్నా. మా అబ్బాయిని డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. నేను డైరెక్టర్ ను కాబట్టి నా జాబ్, నేను చెప్పాలనుకున్న కథ మీదే ఫోకస్ చేశాను. రక్షిత్ బాగా నటించాడు. మనలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. మంచివీ చెడ్డవి. చెడ్డవాటిని మంచివి డామినేట్ చేస్తే మంచోళ్లుగా ఉంటాం. మంచి ఆలోచనలను చెడ్డ ఆలోచనలు డామినేట్ చేస్తే చెడ్డవాళ్లుగా మారుతాము. మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడు అయితే చెడు ఆలోచనలతో రావణుడు రాక్షసుడిగా వధించబడ్డాడు. నేను దర్శకుడిగా ఈ సినిమా రూపొందించి మంచి ఆలోచన చేశానా లేదా అనేది ఆగస్టు 2న ప్రేక్షకులు ఇచ్చే ఫలితంతో తెలుస్తుంది. మా మూవీలో రాధిక గారు కీలక పాత్ర పోషించారు. ఆమెను అప్రోచ్ అయి కథ చెప్పడమే కష్టమైంది. కానీ సెట్స్ లోకి వచ్చాక డైరెక్టర్ గా నేను చెప్పినట్లు నటించారు. నేను డైరెక్టర్స్ నటిని, మీకు షాట్ నచ్చితే చాలు అనేవారు. ఆమె చేసిన అన్ని సినిమాల్లో గుర్తుండిపోయే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. రిఫరెన్స్ గా ఆమె చేసిన కొన్ని సీన్స్ చెప్పుకుంటారు. ఓటీటీలో చాలా సైకో థ్రిల్లర్స్ వస్తున్నాయి. వాటికి పూర్తి భిన్నంగా మా మూవీ ఉంటుంది. అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్స్. పలాస తర్వాత మా ప్రొడక్షన్ లోనే సైకో థ్రిల్లర్ మూవీ చేద్దామని స్టోరీ లైన్ అనుకున్నాం. అప్పుడు నాన్నగారు ఈ సినిమాకు డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారు. చాలా మంది మీ అబ్బాయి ఉన్నాడు కదా సినిమాల్లో మీరు  డైరెక్షన్ ఎందుకు అని మాట్లాడుకునేవారు. సినిమాలు చేయడం అనేది చెడ్డపని కాదు మంచి పనే. “ఆపరేషన్ రావణ్” సినిమాతో మేము సక్సెస్ అందుకోబోతున్నాం. విశ్వక్ గారు అన్నట్లు నన్ను నేనే లేపుకుంటా, ఎవరూ లేపాల్సిన పనిలేదు. ఇది ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట. ఆగస్టు 2న “ఆపరేషన్ రావణ్” సినిమాతో సక్సెస్ అందుకుంటాం. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మిగతా టెక్నీషియన్స్ గురించి ప్రీ రిలీజ్ లో మాట్లాడుతాను. నాన్నగారు డైరెక్టర్ గా చాలా డీటెయిల్డ్ గా షూటింగ్ చేశారు. నా హెయిర్ కు డై వేయించారు. హీరోయిన్ టీవీ జర్నలిస్ట్ కాబట్టి ఆమెకు కొత్త తరహా మేకోవర్ చేయించారు. అలాగే రాకెట్ రాఘవకు పిల్లి గడ్డం పెట్టడం…ఇలా ప్రతి ఒక్కరి పాత్రలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెరకెక్కించారు. రాధిక గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమె నాకు చాలా టిప్స్ చెప్పేవారు. ధనుష్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో ఉదహరించేవారు. అలా నన్ను ప్రోత్సహించారు. నాన్నగారి డైరెక్షన్ అనే టెన్షన్ నాకు లేదు. సెట్ లోకి వెల్తే నేను యాక్టర్ ను, నాన్న డైరెక్టర్ అంతే. మొన్నటివరకు రాధిక గారికి కూడా మేము తండ్రీ కొడుకులం అనే విషయం తెలియదు. పలాస 2 సినిమాకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో ఆ మూవీ ఉంటుంది. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. వెంకట సత్య గారు ఏదో చేయాలని డైరెక్షన్ చేసినట్లు ఎక్కడా అనిపించలేదు. చాలా ప్యాషన్ తో మూవీ చేశారని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమా ఫంక్షన్ కు నన్ను ఇన్వైట్ చేయడానికి రక్షిత్ వచ్చినప్పుడు మా నాన్నగారు డైరెక్ట్ చేశారని చెప్పారు. నేను కూడా మా నాన్నతో కలిసి మూవీస్ చేస్తుంటా. అలా నాకు రక్షిత్ రిలేట్ అయ్యాడు. వెంకట సత్య గారికి స్వీట్ మ్యాజిక్ పేరుతో ఏపీలో ఇక్కడా షాప్స్ , రెస్టారెంట్స్ ఉన్నాయి. సెటిల్డ్ లైఫ్. కానీ వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసం పలాస చేశాడు. ఆ మూవీ డిస్కషన్స్ టైమ్ నాకు తెలుసు. ఆ మూవీకి మంచి పేరొచ్చింది. “ఆపరేషన్ రావణ్”తో మరోసారి రిస్క్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. రక్షిత్ కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇక్కడ లాస్ట్ ఛాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో ఛాన్స్ ఉంటుంది. మనం హోప్స్ వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. కాన్ఫిడెంట్ గా ట్రై చేయి తప్పకుండా సక్సెస్ వస్తుంది. అన్నారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్