కెనడాలో ఉన్నత చదువులు చదువుతున్న పూజితా రెడ్డి (24) అనే వైద్య విద్యార్థి గుండె పోటుతో మరణించింది. పూజితా రెడ్డి మృతదేహాన్ని స్వస్థలం మల్కాపూర్ కి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మల్కాపూర్ గ్రామానికి గ్రామ ఉప సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. ఆ కుమార్తె పేరు పూజితా రెడ్డి. పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. దీంతో పీజీ చేసేందుకు కెనడా వెళ్లింది. 10 రోజుల క్రిందటే గుండెపోటుతో హాస్టల్ లోనే కుప్పకూలిపోయింది. దీంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించగా… చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సోదరులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు.