బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో సరైన ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులు 5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ”టీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ… అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఆయనకు పెద్ద ఊరట లభించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సుమారు 5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కోమటిరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ఈ వివరణతో ఈసీఈ సంత్రుప్తి వ్యక్తం చేసింది.