కేబీఆర్ పార్కులో యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువనటి

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో ఓ యువకుడు తనను వేధించాడంటూ యువ నటి చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పార్కులో వాకింగ్ చేస్తుండగా యువకుడు వెంటబడ్డాడని, తననే వెంబడించాడని పేర్కొంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పార్కు సిబ్బంది కొండాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు పార్కు దగ్గరికి చేరుకున్నాడు. ఆ యువకుడ్ని ప్రశ్నించగా… తన పేరు శేఖర్ అని సమాధానమిచ్చాడు. అయితే.. అక్కడే వున్న సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే.. చౌరాసియా వెంట ఎవరూ పడలేదన్న వాదనలు కూడా వస్తున్నాయి. యేడాది కిందట కూడా చౌరాసియా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. అయితే… యువకుడు శేఖర్ ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Posts

Latest News Updates